BDK: అన్నపురెడ్డిపల్లి మండలం అబ్బుగూడెం గ్రామ శివారు అడవి ప్రాంతంలో అక్కడ పేకాట ఆడుతున్న 5 గురు వ్యక్తులు పట్టు పడ్డారు. పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో ఎస్సై విజయ్ సింహ రెడ్డి తన సిబ్బందితో కలిసి శనివారం సాయంత్రం దాడి నిర్వహించారు. పట్టుబడ్డ వారి దగ్గర నుంచి 4 సెల్ ఫోన్లు 2500/- నగదు స్వాధీనం చేసుకుని సెల్ ఫోన్లు నగదును సీజ్, చేసినట్లు తెలిపారు.