రాత్రి గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరం, మనసు తేలికపడతాయి. ఇది గాఢమైన నిద్రకు ఉత్తమ మార్గం. ముఖ్యంగా నిద్రలేమి లేదా టెన్షన్ ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కండరాల ఒత్తిడి తొలగిపోయి, నొప్పులు తగ్గుతాయి. రోజంతా పేరుకున్న మురికి, బ్యాక్టీరియా తొలగిపోయి చర్మం శుభ్రపడుతుంది. ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిద్రకు గంట ముందు స్నానం చేయడం మంచిది.