TG: HYDలోని NTR స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటి దీపోత్సవాన్ని రాష్ట్రపండుగగా గుర్తిస్తామని అన్నారు. వచ్చే ఏడాది నుంచి అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామని వెల్లడించారు. జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని పేర్కొన్నారు.