SS: పెనుకొండలోని అంబేడ్కర్ సర్కిల్లో ప్రజా ఉద్యమం పోస్టర్ను మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జగన్ ఆదేశాల మేరకు ఈనెల 12న రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి విభాగం అధ్యక్షుడు పొగాకు రామచంద్ర పాల్గొన్నారు.