MBNR: భూత్పూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలలో ఉన్న మౌలిక వస్తువుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని బాలికలను అడిగారు.