TG: 2004 – 2014 కాలం కాంగ్రెస్ పాలన చూసి ఓటు వేయాలని ఇప్పుడు అడుగుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ రెండేళ్లలో ఏం చేశారో నిన్న రేవంత్ రెడ్డి చెప్పలేదని తెలిపారు. అసలు 2004 – 2014 కాలంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారా? అని నిలదీశారు. పాత కాంగ్రెస్ పాలన బాగా ఉంటే.. టీడీపీలో ఉండి అప్పుడు ఎందుకు విమర్శలు చేశారని చురకలు అంటించారు.