SRCL: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు. ఎస్సై వెల్లడించిన వివరాల ప్రకారం.. తంగళ్ళపల్లి మండలం గోపాలరావుపల్లిలో ఎడ్ల వెంకటేష్ (23), 8 నెలల నుంచి ఫైల్స్‌తో బాధపడుతూ ఉన్నాడని తెలిపారు. ఎంతకీ పైల్స్ తక్కువ కాకపోవడంతో తీవ్ర మనస్థాపం చెంది గడ్డి మందు తాగాడన్నారు. ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.