ప్రకాశం: భక్త కనకదాస జయంతి సందర్భంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు కనక దాస చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. కనకదాస రచనలు, కీర్తనల ద్వారా సమాజంలోని కుల అసమానతలను రూపుమాపేందుకు కనకదాస చేసిన కృషి ఎనలేనిదన్నారు. అనంతరం ఆయన రచనలు ప్రజల్లో భక్తి, సమానత్వం, న్యాయం, సత్యం వంటి విలువలను బోధించాయని పేర్కొన్నారు.