KRNL: ఇటీవల ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నరసరావుపేటలో రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు. అయితే జిల్లాకు చెందిన స్విమ్మర్ కె. శృతి అండర్-17 విభాగంలో 100 మీటర్స్ బట్టర్ఫ్లై, 200 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్ విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచి 2 గోల్డ్ మెడల్స్ సాధించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ శృతిని ఘనంగా సన్మానించారు.