GNTR: తెనాలి పట్టణంలోని పలు చోట్లలో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో కొత్తపేటలోని మహిళా మండలి భవనాన్ని తనిఖీ చేయగా, అందులో ముగ్గురు ఉద్యోగులే ఉన్నారు. మిగిలిన వారు గంట ఆలస్యంగా రాగా.. కొత్త గ్రూపులు, రుణాలు, రుణాల రికవరీ గురించి ఆయన అడిగిన ప్రశ్నలకు మెప్మా ఉద్యోగులు బదులువ్వలేదు. దీంతో చేసే పనిని మనసు పెట్టి చేయాలని వారికి సూచించారు.