HYD: వారసత్వ సంపదకు, విభిన్న రుచులకు నిలయమైన హైదరాబాద్‌ను ఏటా 3.6 లక్షలకు పైగా విదేశీయులు సందర్శిస్తున్నారు. చారిత్రక ప్రదేశాలతో పాటు ఘుమఘుమలాడే ఇక్కడి ప్రత్యేక రుచులను వారు ఆస్వాదిస్తున్నారు. ఈ రుచులకు రివ్యూలు ఇస్తూ, ఫుడ్ వ్లాగ్స్ రూపంలో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ, నగర వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం కల్పిస్తున్నారు.