VSP: ‘సీఐఐ పార్టనర్షిప్సమ్మిట్-2025′ కోసం విశాఖ సిద్ధమవుతోంది. రోడ్లు మెరిసిపోతుండగా.. నగరం నిండా వెలుగులు విరజిమ్ముతున్నాయి. పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు భారీగా బ్యూటిఫికేషన్ పనులు కొనసాగుతున్నాయి. అధికారులు రోడ్ల పునరుద్ధరణ, డివైడర్ల అలంకరణ, LED లైటింగ్, పూల సెట్టింగ్స్ పనులను పూర్తి చేస్తున్నారు. దీంతో ప్రధాన కూడళ్లు కొత్తగా మెరిసిపోతున్నాయి.