W.G: మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌కు వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా పోలీసు సూచనలు పాటించాలని నరసాపురం డిఎస్పీ డాక్టర్ జి. శ్రీవేద కోరారు. భద్రతా చర్యలను మరింత పటిష్టం చేశామని, ప్రమాదాలు జరగకుండా సూచించిన ప్రదేశాల్లోనే సముద్ర స్నానాలు చేయాలన్నారు. పోలీస్, మెరైన్, గజ ఈతగాళ్లతో పాటు డ్రోన్ నిఘా ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.