కోనసీమ: వాడపల్లి దేవస్థానం మాజీ ఛైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ రాజు మంగళవారం గుండె పోటుతో మరణించారు. గుండె పోటు రావడంతో అతని కుటుంబ సభ్యులు రాజమండ్రి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ,అక్కడ మృతి చెందారు. ఆయన మృతి పట్ల జిల్లా వైసీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డితోపాటు పలువురు వైసీపీ నాయకులు అభిమానులు సంతాపం తెలిపారు.