అయ్యప్ప దీక్షలో కఠిన నియమాలతోపాటు నలుపు వస్త్రాలు ధరించడం వెనుక అనేక కారణాలున్నాయి. ఒకరోజు అయ్యప్ప, శని దేవునితో ‘నా భక్తులు నీకిష్టమైన నలుపు దుస్తులు ధరిస్తారు. వారిపై శని దోష ప్రభావం ఉండదు’ అని వాగ్దానం చేశాడని పురాణ కథనం. అలాగే, ఈ రంగు అహంకారం, కోరికల నుంచి భక్తులను దూరంగా ఉంచుతుందట. చలికాలంలో చలి, శబరిమల యాత్రలో జంతువుల నుంచి రక్షణగా ఉంటుందని నమ్మకం.