MLG: ఏటూరునాగారం పట్టణ కేంద్రంలో ఆదివారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనాలను తనిఖీ చేస్తుండగా.. ఓ ద్విచక్ర వాహనంపై గుడుంబా రవాణా చేస్తున్న రవిశంకర్ అనే యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 15 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని, రవాణాకు ఉపయోగించిన బైక్ను సీజ్ చేశారు. అలాగే, అతడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.