RSSను ఇప్పటివరకు ఎందుకు అధికారికంగా రిజిస్టర్ చేయలేదని ప్రతిపక్షాలు ప్రశ్నించడంపై ఆ సంస్థ అధినేత మోహన్ భాగవత్ స్పందించారు. హిందూ ధర్మం కూడా ఎక్కడా రిజిస్టర్ చేసుకోలేదని, తాము కూడా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు RSSను గుర్తింపు లేని సంస్థగా చెబుతున్నాయని, అయితే గుర్తింపే లేని సంస్థను గతంలో 3సార్లు ఎలా బ్యాన్ చేశారని ప్రశ్నించారు.