SKLM: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ఏపీ టీపీసి ఛైర్మన్ వజ్జ. బాబురావు అన్నారు. ఆదివారం పలాస మండల గోపాలపురం గ్రామ ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ గోడకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే శిరీష ఆదేశాలతో రూ. 9.31 లక్షలతో పనులు ప్రారంభించామన్నారు. ప్రభుత్వ బడులు కార్పోరేట్ బడులకు దీటుగా తయారు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.