TG: జూబ్లీహిల్స్ అభివృద్దికి ప్రజలు సహకరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ కోరారు. రెండేళ్ల పాలనలో జూబ్లీహిల్స్ అభివృద్ది చెందిందని తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డ్ ఇవ్వలేదని ఆరోపించారు. తాము 14 వేల రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. జూబ్లీహిల్స్ ఇంకా అభివృద్ది చెందాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యమని చెప్పారు.