సత్యసాయి: పెనుకొండ మండలంలో యూటీఎఫ్ నాయకులు ఆదివారం సమావేశం నిర్వహించారు. అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఉద్యోగులకు మెరుగైన వేతనాలను అమలు చేస్తామని 17 నెలలు అవుతున్న పట్టించుకోలేదన్నారు.