ATP: రాయదుర్గంలోని 11వ వార్డులో కమ్యూనిటీ భవన నిర్మాణానికి MLA కాలవ శ్రీనివాసులు భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాయదుర్గం ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. రాయదుర్గంలో రెండు స్టీలు పరిశ్రమలు, టెక్స్టైల్ యూనిట్ల స్థాపనకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఐదేళ్లలో 5 వేల మంది యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని ఆయన తెలిపారు.