SKLM: పొందూరు మండలం తండ్యాం గ్రామంలో ఎన్ .చిన్నమ్మడుకు చెందిన ఇళ్ళు ఆదివారం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న విలువైన వస్తువులతో పాటు, రూ. 6 లక్షల నగదు కాలి పోయినట్లు బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.