KDP: జమ్మలమడుగు DSP వెంకటేశ్వరరావు ఆదివారం మైలవరం పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఇందులో భాగంగా స్టేషన్ రికార్డులు పరిశీలించి కేసుల వివరాలను SI శ్యామ్ సుందర్ రెడ్డితో తెలుసుకున్నారు. అనంతరం గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు రాకుండా గట్టి నిఘా ఉంచాలని సిబ్బందికి సూచించారు. రూరల్ CI భాస్కర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.