ELR: జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెంలో ఏపీ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన బయో రీసెర్చ్ సెంటర్ను ఆదివారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. ఈ సెంటర్లో ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన కషాయాలు, విత్తనాలు, జీవామృతం, ఇతర సహజ ఉత్పత్తులు రైతులకు సులభంగా అందుబాటులో ఉంటాయని అధికారులు వివరించారు.