KRNL: జిల్లా ప్రజలు ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఇవాళ ఓ ప్రకటనలో సూచించారు. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో వచ్చే యాడ్స్ నమ్మవద్దని, వ్యక్తిగత వివరాలు పంచుకోకూడదని హెచ్చరించారు. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని, http: //www. cybercrime. gov. in లో ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు.