ప్రకాశం: కనిగిరి బాలికల వసతి గృహంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ.. ప్రజలకు న్యాయసేవలు అందించేందుకు న్యాయసేవాధికార సంస్థ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. అనంతరం చట్టాల గురించి ప్రజలకు అవగాహన కలిగి ఉండాలన్నారు.