SRPT: చదువు మధ్యలో మానివేసిన వారికి తిరిగి చదువుకునేందుకు ఓపెన్ స్కూల్ ఒక వరం లాంటిదని, ఓపెన్ స్కూల్ సొసైటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ క్రాంతి రెడ్డి అన్నారు. ఆదివారం ఆమె కోదాడ పట్టణంలోని ఓ అకాడమీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అకాడమీలో పలు రిజిస్టర్లను, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.