ప్రకాశం: పార్టీ సభ్యత్వం తీసుకుని ప్రమాదవశాత్తు మృతిచెందిన కుటుంబాలకు టీడీపీ అండగా ఉండి భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా గిద్దలూరులోని పార్టీ కార్యాలయంలో ఇటీవల పార్టీ సభ్యత్వం తీసుకుని మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5లక్షల చొప్పున చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.