W.G: భీమవరంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధనల్లో ఎమ్మెల్యే అంజిబాబు ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్తీక వన సమారాధనతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోందని, కార్తీక మాసంలో వన భోజనాలు ఎంతో ప్రత్యేకమైనవని అన్నారు. అలాగే ఐక్య మత్యంగా ఉంటే సమాజంలో ఏదైనా సాధించవచ్చన్నారు.