వికారాబాద్ పట్టణంలోని బీజేఆర్ చౌరస్తా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒక డీసీఎం, స్విఫ్ట్ కారు మధ్య జరిగిన పాక్షిక ప్రమాదం కారణంగా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ చిన్న ప్రమాదం వల్ల కూడా వాహనాలు పెద్ద ఎత్తున రోడ్డుపై నిలిచిపోయాయి. ఈ ట్రాఫిక్ జామ్తో వికారాబాద్ పట్టణ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.