కర్నూలు జిల్లా కోర్టులో జాతీయ న్యాయ సేవల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. శాశ్వత లోక్ అదాలత్ ఛైర్మన్ వెంకట హరినాథ్ ముఖ్య అతిథిగా హాజరై న్యాయ సేవల ప్రాధాన్యం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 39A ప్రకారం బడుగు బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరాం, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద ఉన్నారు.