కోనసీమ: మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లిలో వివాహిత ఉరివేసుకుని మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముమ్మిడివరం మండలం సోమదేవరపాలెంకి చెందిన మట్టా రేఖ (24) వేములపల్లిలో ఉన్న తన తండ్రి ఇంటికి కాన్పు కోసం నాలుగు నెలల క్రితం వచ్చింది. ఫోన్లో ఆమె భర్త వేణుతో గొడవపడి ఉరి వేసుకుందని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.