VKB: పిల్లల మానసిక, శారీరక అభివృద్ధి అంచనాకు ప్రాథమిక దశలోనే కుటుంబ ఆరోగ్య శాఖ కొత్త యాప్ను అభివృద్ధి చేసింది. పైలట్ ప్రాజెక్టుగా వికారాబాద్ జిల్లాను ఎంపిక చేసింది. అంగన్వాడీ కేంద్రాలలో ఈ యాప్ సహాయంతో రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమ బృందాలు పరీక్షలు నిర్వహించనున్నాయి. ఒక నెల వయసు నుంచి ఆరు నెలల పిల్లల అభివృద్ధి లక్షణాలను నమోదు చేస్తారు.