కోనసీమ: కాట్రేనికోన మండలం గెద్దనపల్లికి చెందిన బడుగు వెంకటరమణ(48) బ్రెయిన్ స్ట్రోక్తో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె శ్రావణి దుఃఖాన్ని దిగమింగుకుని బరువెక్కిన హృదయంతో ఆదివారం తండ్రికి తల కొరివి పెట్టింది. ఈ సంఘటన చూపరులను కన్నీటి పర్వతం చేసింది.