GNTR: పెదకాకాని మండలం నంబూరులో మూడు రోజుల పాటు వైభవంగా జరిగిన బాలోత్సవ్-2025 వేడుకలు ఆదివారం ఘనంగా ముగిశాయి. దేశవ్యాప్తంగా వందలాది పాఠశాలల విద్యార్థులు విచిత్ర వేషధారణ, జానపద, శాస్త్రీయ నృత్యాలతో అలరించారు. విజేతలకు ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, డా. పాపినేని శివశంకర్, వైస్ ఛాన్సలర్ రాంబాబు కొడాలి బహుమతులను అందజేశారు.