SRPT: పిచ్చి కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు అయిన ఘటన మంగళవారం సూర్యాపేట పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని 43 వార్డులో ఓ బాలుడు ఆడుకుంటుండగా పిచ్చికుక్క అతని చేతిపై దాడి చేసిది. దీంతో అక్కడే ఉన్న స్థానికులు గమనించి వెంటనే సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.