W.G: తణుకులోని పాత ఊరు బాలికల బీసీ హాస్టల్‌ను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని విద్యార్థినులతో మాట్లాడి, అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, రుచిగా ఉందా అని ఆరా తీశారు. డైనింగ్ హాల్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.