ASF: కంకలమ్మ జాతరకు పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కాగజ్ నగర్ డీఎస్పీ వహిదుద్దీన్, సీఐ సంతోష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం జాతర ఏర్పాట్లను ఆలయ కమిటీ ఛైర్మన్ కనకయ్యతో కలిసి పరిశీలించారు. అనంతరం జాతర ఏర్పాట్లను కమిటీ ఛైర్మన్‌ను అడిగి తెలుసుకున్నారు. జాతరకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశాలు ఉన్నందున పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.