AP: మాజీ ఎంపీ బుట్టా రేణుక కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ అయినా, ఎంపీ టికెటైనా తానెప్పుడూ అడగలేదని పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ ఆదేశాలను పాటించానని అన్నారు. ఎమ్మిగనూరు బాధ్యతలు ఎవరికి అప్పగించినా అందరూ కట్టుబడి ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తామంతా వైసీపీ కుటుంబ సభ్యులమని తెలిపారు.