MHBD: పెద్దవంగర మండలం పోచారం శివారు భద్రు తండాకు చెందిన ధరావత్ సోమని (41) అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి, 10వ తరగతి స్నేహితులు ఇవాళ నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.21 వేల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో కొమరమల్లు, సంపత్, రాము, సోమన్న, శ్రీనివాస్ ఉన్నారు.