AP: మానవుడికి ఆరోగ్యపరంగా ఎంతో విలువైన తాటి ముంజలు వేసవి కాలంలోనే కాదు.. ఇప్పుడు శీతాకాలంలోనూ దొరుకుతున్నాయి. విశాఖలోని ఆనందపురం, భీమిలి, పద్మనాభం నుంచి వీటిని తెచ్చి విశాఖ-భీమిలి బీచ్ రోడ్డులోని సీతకొండ వద్ద ఓ వ్యక్తి తాజాగా అమ్ముతున్నాడు. డజను ముంజలు రూ.100 చొప్పున విక్రయిస్తున్నాడు. పల్లెల్లో ఉచితంగా దొరికే వీటికోసం పట్టణాల్లో జనాలు ఎగబడి కొంటున్నారు.