నల్గొండలో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ ఏడీఈ వేణుగోపాలచార్యులు తెలిపారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు జరుగుతున్న ప్రాంతాలైన అబ్బాసియా కాలనీ, కాపురాల గుట్ట, శివరాంనగర్, సిద్ధార్థ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఎడీఈ కోరారు.