NZB: అర్సపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రక్కన ఆదివారం ఫిట్స్ వచ్చి రోడ్డుపై పడిపోయిన ఓ వ్యక్తిని అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పవన్ కుమార్ సకాలంలో స్పందించి కాపాడారు. ఆయన వెంటనే సదరు వ్యక్తికి ప్రథమ చికిత్స చేయించి, ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ట్రాఫిక్ ఇన్స్పక్టర్ ప్రసాద్, పవన్ కుమార్ని అభినందించారు.