MBNR: వర్షాభావం కారణంగా భక్తుల రాక తగ్గడంతో అమ్మపురం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలలో అలంకార దర్శనాలను నవంబర్ 17 వరకు పొడిగించారు. ఈ మేరకు పాలకమండలి ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి, ఈవో మదనేశ్వర్ రెడ్డి ప్రకటించారు. ఈనెల 17న ఉదయం 10 గంటలకు అలంకారం తొలగించనున్నట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల ఎక్కువ మంది భక్తులకు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది.