పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ భోజన ప్రియుడు అన్న విషయం తెలిసిందే. సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు తనతో పాటు పనిచేసే నటీనటులకు కూడా తన ఇంట్లో వండిన భోజనం పంపించాడు. తాజాగా ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి డార్లింగ్ ప్రత్యేక విందు పంపించాడు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘మనసు, కడుపు నిండిపోయింది. మీ ప్రేమకు థాంక్యూ ప్రభాస్ గారు’ అంటూ వీడియో పోస్ట్ చేసింది.