MHBD: మరిపెడ మండలంలోని బురహానుపురం గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతివేగంగా వచ్చిన బైక్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. దీంతో శివరాత్రి చందు అక్కడికక్కడే మృతిచెందగా రాము అనే యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 లో ఆసుపత్రికి తరలించారు.