AP: ఔషధ సంస్థ లారస్ ల్యాబ్స్ అధునాతన తయారీ కాంప్లెక్స్‌ను విశాఖలో రూ.5,000 కోట్లకు పైగా పెట్టుబడితో నిర్మిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 532 ఎకరాలకు స్థలం కేటాయింపు పూర్తయిందని ఆ సంస్థ వ్యవస్థాపకులు చావా సత్యనారాయణ తెలిపారు. రాబోయే 8 ఏళ్లలో రూ.5,280 కోట్ల పెట్టుబడులు పెడతామని వెల్లడించారు. ఇప్పటి నుంచి ఏడాదికి రూ.1,000 కోట్ల పెట్టుబడితో పనులు చేపడతామన్నారు.