కృష్ణా: నందివాడ మండలం తమిరిసలో రహస్యంగా కోడి పందేలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఎస్సై శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి ఆదివారం సాయంత్రం శిబిరంపై దాడి చేశారు. ఈ ఘటనలో కోడి పందేలు నిర్వహిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ₹2,400 నగదును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.