KKD: జగ్గంపేటలో పబ్లిక్ ప్లేస్లో మద్యం సేవిస్తున్న పలువురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగ్గంపేట ఎస్సై టి. రఘునాథరావు సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో జగ్గంపేట శివారు ప్రాంతాలలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న పలువురు అదుపులోకి తీసుకుని, వారిని స్టేషన్కు తరలించారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే ఉపేక్షించేది లేదన్నారు.