KDP: ప్రొద్దుటూరు 2వ జిల్లా అదనపు జడ్జి సత్యకుమారి ఆదివారం స్థానిక సబ్ జైలును సందర్శించారు. ఇందులో భాగంగా జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా రిమాండ్లోని ఖైదీలతో సమావేశమయ్యారు. ఈ మేరకు న్యాయసేవలు, ప్రజల హక్కుల గురించి వారికి వివరించారు. అనంతరం ఆర్థిక, ఇతర కారణాల వల్ల ఎవ్వరూ న్యాయ సహాయానికి దూరం కాకూడదన్నారు.